Nizamabad | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవం కాస్త కాంగ్రెస్, బీజేపీ నేతల వీధి పోరాటానికి వేదికైంది. దుబ్బా ప్రాంతంలో గణేష్ శోభాయాత్రను ప్రారంభించేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా వర్గీయులు సిగపాట్లు పడ్డారు. శోభయాత్ర ప్రారంభానికి జెండా కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సాక్షిగా ఇరుపార్టీల వర్గీయులు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.