మోర్తాడ్ : ఈ నెల 17 న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించనున్న కామ్రేడ్ యాదగిరి (Comrade Yadagiri) సంతాప సభను విజయవంతం చేయాలని సీపీఐఎంఎల్ (CPI ML) మాస్‌లైన్ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ మండల కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి ఉద్యమమే వృత్తిగా , ఆదర్శ కమ్యూనిస్టుగా జీవనాన్ని కొనసాగించారని తెలిపారు. ఆయన మరణాంతరం తన కళ్లను మరొకరికి దానం చేసిన త్యాగజీవి అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో చిన్నక్క, దయాల్‌సింగ్, గంగు, మజీద్, దశరథ్, రాజేశ్వర్, సువర్ణ, నర్సయ్య , దుర్గయ్య, గజానంద్, చిన్న గంగారం,ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.