Padala Ramulu | శక్కర్ నగర్ : కామ్రేడ్ పడాల రాములు చేసిన పోరాటాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళులు అని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ అన్నారు. బోధన పట్టణంలోని పాన్ గల్లి లో కామ్రేడ్ పడాల రాములు 22వ వర్ధంతిని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ రాములు 2003లో గుండెజబ్బుతో ఆకస్మాత్తుగా మృతి చెందారని, ఆయన మృతి ప్రజలకు అన్నారు. ఆయన రైతుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటంలో ముందుండేవారిని అన్నారు. నిజాంసాగర్ నీరు జిల్లా ప్రజల హక్కు అని జరిగిన పోరాటంలో, ఎన్ఎస్ఎఫ్ భూముల పోరాటంలో ఆయన ముందుంటూ చురుకైన పాత్ర పోషించారని, విద్యార్థి యువజన కార్మిక మహిళ రంగాల వారికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు .
ఆయన పోరాటాల స్ఫూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలు అందరు ముందు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, బొంతల సాయిలు, ఎస్ బాలయ్య, జి పార్వతి పోశెట్టి రాములు, సుమన్, హరి తదితరులు పాల్గొన్నారు.