Peddakodapgal | పెద్దకొడప్గల్, అక్టోబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.