ఖలీల్‌వాడి, జూన్ 7: ‘పేరుకే ఆదర్శం.. పనులు ఆలస్యం’ cనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పందించారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు.
నాలుగు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన పనులు చేపట్టాలని, నిధులు వృథా చేయొద్దని సూచించారు. వివిధ రకాలుగా క్రీడా మైదానాన్ని వినియోగించాలని, దీంతో పాములు, ఇతర విష పురుగుల బెడద లేకుండా ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మకరంద్, ఈఈ దేవీదాస్, ఏఈ ఉదయ్‌కిరణ్ తదితరులు ఉన్నారు.