రెంజల్. ఆగస్టు 9: అర్హులమైన తమకు రుణమాఫీ కాలేదని, కనికరించి రుణాలు మాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం పలువురు రైతులు కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం రూ.లక్షన్నర లోపు పంట రుణాలను మాఫీ చేయగా, కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రుణమాఫీ వర్తించలేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్ మాఫీ కాని రైతుల జాబితాను రెండ్రోజుల్లో సమర్పించాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఈ సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని రైతులు తెలిపారు.