ఖలీల్‌వాడి(మోపాల్), సెప్టెంబర్ 12: జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజూ ఉదయం వేళ అటెండెన్స్‌ను పర్యవేక్షించాలని సూచించారు. గురువారం ఆయన మోపా ల్ మండలం ముదక్పల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆయా విభాగాలతోపాటు మం దుల నిల్వలు, స్టోర్ రూమ్, ఇన్పేషెంట్వార్డు, ల్యాబ్‌ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందిపై ఆరా తీయగా పలువురు అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా పీహెచ్సీలో వైద్యాధికారి సెలవులో ఉంటే ఇతర దవాఖానల నుంచిసర్దుబాటు చేయాలని సూచించారు. పాముకాటు, కుక్కకాటు మందులతో పాటు అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.