కామారెడ్డి, జూలై 29: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. రోబోయే రోజుల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నా రు. ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
వర్షాల సమయం లో ఎట్టి పరిస్థ్ధితుల్లోనూ నదులు, వాగు లు, చెరువులు, కాలువలు, ఇతర నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి లో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ నం.84682 20069తో పాటు డయల్ 100, అగ్నిమాపక శాఖ 101కు కాల్ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, వీఎన్ గిరి, ట్రైనీ కలెక్టర్ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.