రామారెడ్డి, నవంబర్ 2 : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. రామారెడ్డి మండలం పోసానిపేట్లోని కొనుగోలుకేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు.
కాంటా వేస్తున్న ధాన్యాన్ని పరిశీలించి.. ప్యాడీ క్లీనర్ల ద్వారా వడ్లలో చెత్త లేకుండా చూడాలన్నారు. ఒక్కో బస్తా 40 కిలోల 600 గ్రాములు మాత్రమే తూకం వేయాలని స్పష్టం చేశారు. వర్షానికి ధాన్యం తడిసి పోకుండా కేంద్రాల్లో టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కలెక్టర్వెంట జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మానిటరింగ్ అధికారి సాయిలు ఉన్నారు.