కామారెడ్డి, జూలై 26 : రోడ్లపై ఎవరైనా చెత్తవేస్తే జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. పట్టణ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ డ బుల్ బెడ్రూం ఇండ్ల వద్ద శుక్రవారం ఆయన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద ముళ్ల పొదలు, మురికి కాలువలను శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురికి కుప్పలను తొలగించి మొక్కలు నాటాలని అన్నారు. రంగవల్లులు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.