Satyanarayana Vratham | శక్కర్ నగర్, నవంబర్ 4 : బోధన్ పట్టణంలోని ప్రముఖ శ్రీ చక్రేశ్వర శివాలయంలో మంగళవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలకు హాజరయ్యారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలను ఈ సారి కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు గణేష్ శర్మ, మహేష్ పాటలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. సామూహిక సత్యనారాయణ వ్రతం సందర్భంగా సంజీవరెడ్డి దంపతులు ఆలయంలో అన్నదానం జరిపించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో రాములు, ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, డైరెక్టర్లు పర్యవేక్షించగా.. ఆలయ సిబ్బంది సుధాకర్, చంద్రకళ తమ వంతు సేవలు అందించారు.
Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో