నిజామాబాద్ : వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఓ వరంలా ఉపయోగపడుతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏడుగురు బాధితులకు రూ. 3.85 లక్షల చెక్కులను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఏనుగందుల మురళి, ఎర్రం గంగాధర్, బిళ్ల మహేశ్, అబ్దుల్ బారి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ. 6 లక్షల చెక్కులను టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఆర్ రాంకిషన్ రావు 13 మందికి అందజేశారు. కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ ఎస్ఏ అలీం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడా డైరెక్టర్లు రాజేంద్రప్రసాద్, అక్తర్ ఖాన్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, జలపతి రావు, అనిల్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.