డిచ్పల్లి, నవంబర్ 14 : మండలకేంద్రంలోని గాంధీనగర్ వద్ద ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 16న మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
సభకు రూరల్ నియోజకవర్గం నుంచి 40 వేల మంది, డిచ్పల్లి మండలం నుంచి 10 వేల మందిని తరలిరానున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, శక్కరికొండ కృష్ణ, విండో చైర్మన్ గజవాడ జైపాల్, పార్టీ నాయకులు దండుగుల సాయిలు, నీరడి పద్మారావు, రామకృష్ణ, రవికిరణ్, ఒడ్డెం నర్సయ్య, నల్లవెల్లి సాయిలు, అంజయ్య, ఫైజల్ పాషా, అజహర్, లొక్కిడి శంకర్, సూదం నాయక్, ప్రమోద్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.