తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా నిజామాబాద్‌కు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ నేత తారిఖ్ అన్సారీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మలి దశ తెలంగాణ పోరాటంలో అన్సారీ చురుగ్గా పాల్గొన్నారు. 2002 నుంచి సీఎం కేసీఆర్ వెన్నంటి నడిచారు. దీంతో తారిఖ్‌ను మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి నియమించారు. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
– ఖలీల్‌వాడి, మార్చి 3
ఖలీల్‌వాడి, మార్చి 3: రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా తారిఖ్ అన్సారీ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తారిఖ్ అన్సారీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2002 నుంచి బీఆర్ఎస్లోనే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. తారిఖ్ అన్సారీని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించడంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విధేయతకు పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.