నమస్తే తెంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 15: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో సంబురాలు కొనసాగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు పలు దవాఖానల్లో రోగులకు, పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఆలయాల్లో పూజలు చేసి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని దేవుడిని ప్రార్థించారు. పలుచోట్ల కేక్ కట్చేసి తినిపించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ జిల్లా, మండల, స్థానిక నాయకులు పాల్గొన్నారు.