Pothangal | పోతంగల్, జనవరి 29 : సీఎం కప్ పోటీలను గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చందర్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ఎంపీడీవో చందర్ స్థానిక నాయకులతో కలిసి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల నైపుణ్యాలను వెలికి తీయడం కోసమే క్రీడలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, నాయకులు పుప్పాల శంకర్, గంట్ల విఠల్, కాషా గౌడ్, శాంతిశ్వర్ పటేల్, ఏజాజ్ ఖాన్, పూల కంటి సాయిలు, పలు గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.