రుద్రూర్, జనవరి 13: అపరిశుభ్ర నీటిని తాగడంతో రోగాల బారిన పడుతారని, ఆ సమస్యను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్లో శుక్రవారం పర్యటించిన ఆయన 50 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ, నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వంద లీటర్ల చొప్పున శుద్ధ జలాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకుంటే.. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు.
నీటి శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన వీఆర్ దేశాయ్ కుటుంబ సభ్యులతోపాటు సహకరించిన గ్రోమోర్ చోలా మండల్, బాల వికాస సంస్థ బాధ్యులను స్పీకర్ అభినందించారు. పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రుద్రూర్ నుంచి బొప్పాపూర్ మీదుగా భవానీపేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం విఠలేశ్వ రుడిని దర్శించుకున్నారు. అక్బర్‌నగర్‌లో బాధిత కుటుంబాలను స్పీకర్ పరామర్శించారు.
కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఈఈ నాగేశ్వర్రావు, బోధన్ ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్, జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, వైస్ ఎంపీపీ సాయిలు, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, పార్టీ గ్రామ అధ్యక్షుడు తొట్ల గంగారాం, సర్పంచులు ఖాదర్, లక్ష్మణ్, రోజా, గంగామణి, పుష్పలత, భాగ్య, ఎంపీటీసీ పత్తి సావిత్రి, రుద్రూర్ ఉప సర్పంచ్ ఆసియా కౌసర్, సోషల్ మీడియా కన్వీనర్ లాల్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ, జనవరి 13: చదువుతోపాటు క్రీడలూ అవసరమని, విద్యార్థులు, యువత కోసం క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాట్లు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని మినీ స్టేడియంలో క్రీడాకారుల కోసం కలెక్టర్ మంజూరు చేసిన క్రీడా సామగ్రిని బాన్సువాడలోని స్పీకర్ స్వగృహంలో ఆయన శుక్రవారం అందజేశారు. ఆర్చరీ, డిస్కస్ త్రో, బాస్కెట్ బాల్‌కు సంబంధించిన ఆట వస్తువులను ఆయన మినీ స్టేడియం బాధ్యుడు పంతుల నరేశ్‌కు అందజేశారు. స్పీకర్ సూచనల మేరకు కలెక్టర్ వాటిని మంజూరు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారంతో పాటు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌కు మినీ స్టేడియం బాధ్యులు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ అధ్యక్షుడు ఎర్వాల కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్, కౌన్సిలర్ లింగమేశ్వర్, బీఆర్ఎస్ నాయకుడు నార్ల ఉదయ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.