వినాయక్‌నగర్, ఏప్రిల్ 2: జాతీయ జెండాను ఎగురవేయడానికి కాంగ్రెస్ నాయకులు న్యాల్కల్ చౌరస్తా వద్ద ఉన్న హనుమాన్ ఆలయం ఎదుట గద్దెను నిర్మించారు. ఆలయం ఎదుట నిర్మించడంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయా పార్టీల నాయకుల మధ్య బుధవారం వాగ్వాదం చోటుచేసుకున్నది.
విషయం తెలుసుకున్న నగర సీఐ శ్రీనివాస్‌రాజ్, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జెండా ఆవిష్కరణను ఎలా అడ్డుకుంటారని, ఏమైనా ఉంటే ముందు నోటీసులు ఇవ్వాలని సీఐని నిలదీశారు. జాతీయ జెండాను ఎగురవేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.