కామారెడ్డి రూరల్ : జిల్లాలోని దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును (Children’s Park) మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(IG Chandrashekar Reddy) గురువారం ప్రారంభించారు. కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ప్రత్యేక కృషితో చిల్డ్రన్ పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని ఐజీ అన్నారు. అనంతరం పార్కులో ఐజీ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి, రూరల్ సీఐ రామన్, దేవనపల్లి ఎస్ఐ రాజు , పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.