ఖలీల్వాడి, జూన్ 15 : నిజామాబాద్ జిల్లాజక్రాన్పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్ కార్తీక్నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువజన సాహిత్య పురస్కారం-2024ను ప్రకటించారు. ఆయనకు పురస్కారం దక్కడంపై హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ శనివారం ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 26 ఏండ్ల చిన్న వయస్సులోనే పురస్కారం అందుకున్న ఘనత రమేశ్ కార్తీక్నాయక్కు దక్కిందని పేర్కొన్నారు. బంజారాల జీవనచిత్రాలను సహజంగా, తన కథల్లో ఆకర్షణీయంగా చెప్పారని కొనియాడారు. ఆయన ప్రతిభను గుర్తించి 2023లో హరిదా రచయితల సంఘం.. హరిదా యువ సాహిత్య పురస్కారాన్ని బహూకరించి గౌరవించినట్లు గుర్తుచేశారు.