ఆర్మూర్ : నిరుద్యోగులకు ఉద్యోగల కల్పనలో కేంద్రం (Centre) ఘోరంగా విఫలమైందని సీపీఎం (CPM) ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకట్ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు దాటి పోవస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టిని సారించడం లేదని ఆరోపించారు.
ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేక పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.