మాచారెడ్డి : పాల్వంచ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గురువారం సంబరాలు(BJP Celebrations ) జరుపుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ టీచర్స్ , పట్టభద్రుల ( Graduate ) ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ(BJP) కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలో కి వచ్చిన కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వానికి పట్టాభద్రులు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మకుండా బీజేపీ పార్టీకి ఓటు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోసు అనిల్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తోట బాలరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి వడ్ల నరసింహాచారి , ప్రధాన కార్యదర్షులు రాగవాపురం శ్రీనివాస్, సామాగంజి నరేష్, బీజేవైఎం అధ్యక్షులు సత్యం, కిసాన్ మోర్చా అధ్యక్షులు చెన్నం నర్సారెడ్డి , బొడ్డు రాహుల్ పాల్గొన్నారు.