డిచ్పల్లి, ఫిబ్రవరి 16 : ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లిలో గ్రామ పంచాయతీ, వీడీసీ ఆధ్వర్యంలో రూ.4లక్షల 50వేల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీపీ నాగరాజుతో కలిసి బాజిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని, వీడీసీ సభ్యులను ఆయన అభినందించారు. గ్రామాల్లో తరచూ చోరీలు జరుగుతున్నాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలను నియంత్రించవచ్చని అన్నారు. ఖిల్లా డిచ్‌పల్లిని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆయన అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, డీసీఎంఎస్ చైర్మన్ సాంబా రి మోహన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల రాములు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఎంపీటీసీ కొత్తూరు మానససాయి, ఉపసర్పంచ్ ఆసది రవీందర్, విండో చైర్మన్ గజవాడ జైపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లహరికిషన్, ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, లక్ష్మీనర్సయ్య, ఒడ్డెం నర్సయ్య, సీఐ ప్రతా ప్, ఎస్సై నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ, ఫిబ్రవరి 16 : మండలంలోని రావుట్ల గ్రామంలో కొలువైన గాడిమాకుల రాజరాజేశ్వర ఆలయాన్ని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవంలో పాల్గ్గొని రథాన్ని లాగారు. తన జన్మదినం సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఆలయ ఆవరణలో కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తోట రాజన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచ్ భూదెవ్వ, ఉప సర్పంచ్ రఘువాస్, సర్పంచులు రాజరెడ్డి, కన్క శ్రీనివాస్, నాయకుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు.