CC ROAD | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని రెండో వార్డులో గురువారం సిసి రోడ్డు నిర్మాణం పనులను గుడి సొసైటీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గ్రామస్తులు కలిసి గురువారం ప్రారంభించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.4 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను చేపడుతున్నామని ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టి త్వరితగతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, బుడిమీ సోసైటీ మాజీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్, లక్ష్మా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.