గాంధారి, డిసెంబర్ 7: సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని గుర్జాల్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతాబాయి లక్పతిరావు, జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణరావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ భజన్‌లాల్, సంజీవ్, నాయకులు పెద్దబూరి సత్యం, ముకుంద్‌రావు, విండో వైస్ చైర్మన్ ఉద్దల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.