బోధన్, జూన్ 5: బోధన్ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు మరోసారి రద్దయ్యింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. ఇంటర్ లాకింగ్ పనుల కోసం రైలును రద్దుచేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్ లాకింగ్ కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలా మరికొన్ని ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దుచేశారు. ఇప్పటికే అనేక సార్లు రద్దయిన బోధన్ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు మరోసారి రద్దుకావడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.