Murder | ఆలూరు : ఆలూర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య సంఘటన స్థానికులను దిగ్భాంతికి గురిచేసింది. గ్రామానికి చెందిన గొల్ల పెద్ద గంగారంను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.