బిచ్కుంద, మే 28: మద్నూర్ మండల కేం ద్రంలో నేడు (శుక్రవారం) బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. గురువారం ఆయన బిచ్కుంద పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. మ ద్నూర్ మండల కేంద్రంలోని మైథిలీ ఫంక్షన్ హాలులో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రిజివన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ఇన్చార్జీలు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సన్నాహక సమావేశానికి జుక్కల్ నియోజక వర్గంలోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, డోంగ్లి, నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్, మహమ్మద్‌నగర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ, బిచ్కుంద మున్సిపాల్టీ యూత్ సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరైన విజయవంతం చేయాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటిస్తూ సమావేశానికి హాజరుకావాలని సూచించారు.