కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఫారుక్ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని(Diary launched) పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఫారుక్ మాట్లాడుతూ మండలంలోని ఆయ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అవినీతికి సంబంధించిన అంశాలను పింక్ డైరీలో తెలంగాణ భవన్ అందజేయల్సి ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరూ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు పింక్ డైరీలో రాయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్, స్థానిక మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తిప్పయ్య, పి.కిష్టయ్య, జుబేర్, గడ్డం పెద్ద సాయిలు, అశోక్, ఇమ్రాన్, అనిల్, రఫిక్, మాస్టయ్య, అజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.