ఆర్మూర్ : బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan Reddy ) జన్మదిన వేడుకలను శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో నవసిద్ధుల గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మామిడిపల్లిలోని శ్రీ తపస్య అనాథ పిల్లల ఆశ్రమంలో బీఆర్ఎస్ ఆర్మూర్ ఇన్చార్జి ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. అనాథ పిల్లలకు అన్నదాన నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ మెట్టు సంతోష్ , ఆర్మూర్ మాజీ కౌన్సిలర్లు గంగామోన్ చక్రు, అల్జాపూర్ మహేందర్ , వరలక్ష్మి, లింబాద్రిగౌడ్, సీనియర్ నాయకులు పోలా సుధాకర్, జీజీరామ్ , యువజన అధ్యక్షులు పృథ్వీరాజ్ , మీరా, శ్రావణ్, జనపల్లి రంజిత్ , శ్రీకర్ , సాంబాడి ఆనంద్, అగ్గు క్రాంతి, రోహిత్, పవన్ సాహెబ్ పాల్గొన్నారు.