బోధన్/ ఖలీల్‌వాడి, ఏప్రిల్ 13: బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆదివారం పరామర్శించారు. షకీల్ మాతృమూర్తి షగుఫ్త ఆదిబ్ మూడు రోజుల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే.
తల్లి అంత్యక్రియల కోసం బోధన్‌కు వచ్చిన షకీల్ రెండు రోజులపాటు బోధన్‌లో ఉన్నారు. అనంతరం హైదరాబాద్‌లోని స్వగృహనికి వెళ్లగా అక్కడికి ఎమ్మెల్సీ కవిత, తన భర్త అనిల్‌కుమార్‌తోపాటు బిగాల వెళ్లి పరామర్శించారు. షకీల్ తల్లి మరణానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు.