ఖలీల్‌వాడి/ డిచ్పల్లి / ఇందల్వాయి, డిసెంబర్ 29 : నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా రోజుల తర్వాత ఆదివారం రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఆమెను సత్కరించారు. మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చి స్వాగతం పలికారు. బ్యాండ్ వాయిద్యాలు, నృత్యాలతోపాటు పటాకులు కాలుస్తూ ఉత్సాహంగా సాగతం పలికారు. ఎస్ఎఫ్ఎస్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వరకు బీఆర్ఎస్ శ్రేణులు ఆమె వెంట తరలివెళ్లారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వస్తుండగా ఇందల్వాయిలోని టోల్‌ప్లాజా వద్ద గజమాలతో సత్కరించారు. డిచ్పల్లిలోని కేపీ దాబా ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సాగతం పలికారు.
ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి నుంచి మొదలుకొని జిల్లాకేంద్రం వరకు ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డిచ్పల్లి వద్ద స్వాగతం పలికిన వారిలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మారావు, ఒడ్డెం నర్సయ్య, దాసరి లక్ష్మీనర్సయ్య, కుంచాల రాజు, నట్ట భోజన్న, డీకొండ శ్రీనివాస్, మొచ్చ శ్రీనివాస్, కుమ్మరి గంగాధర్, శ్రీకాంత్, యూసుఫ్, సంజయ్, అజయ్, ప్రమోద్, సతీశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇందల్వాయి వద్ద స్వాగతం పలికిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాస్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాంబారి మోహన్, మాజీ ఎంపీపీ రమేశ్ నాయక్, మాజీ సర్పంచ్ పాశం కుమార్, అరటి రఘు, శ్రీను, సుధాకర్ తదితరులు ఉన్నారు.
ధర్పల్లి/ రెంజల్/ శక్కర్‌నగర్, డిసెంబర్ 29 : ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికేందుకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ధర్పల్లి మండలంలోని నాయకులు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద స్వాగతం పలికేందుకు తరలివెళ్లారు. ధర్పల్లి నుంచి తరలిన వారిలో బీఆర్ఎస్ నాయకులు మహిపాల్‌యాదవ్, మాజీ ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పీసు రాజ్‌పాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రెంజల్ మండలకేంద్రం నుంచి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిజామాబాద్‌కు తరలివెళ్లారు.
ఎమ్మెల్సీ కవిత రాక నాయకులు, కార్యకర్తలత్లో ఉత్తేజాన్ని నింపిందని సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌కు తరలిన వారిలో నాయకులు గోపాల్‌రెడ్డి, రఫీక్, రాము తదితరులు ఉన్నారు. బోధన్ పట్టణం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. తరలిన వారిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, గుమ్ముల అశోక్ రెడ్డి, నాగన్‌పల్లి మధు, రవి శంకర్‌గౌడ్, శంకర్ గౌడ్, జావిద్, నవీన్, భవానీపేట్ శ్రీనివాస్, సాగర్ ఉన్నారు.
ఖలీల్‌వాడి, డిసెంబర్ 29 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆటోమోటర్ డ్రైవింగ్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎమ్మెల్సీ కవితకు ఆదివారం వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెను యూనియన్ నాయకులు కలిసి వారి సమస్యలను విన్నవించారు.