BRS KOTAGIRI Ex MPP | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ మోరే సులోచన కిషన్ ను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బాన్స్ వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ శుక్రవారం పరామర్శించారు. ఇటీవల సులోచన కు సర్జరీ కావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న జుబేర్ కోటగిరిలోని సులోచన కిషన్ ఇంటికి చేరుకొని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కష్టపడ్డారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బీ ఆర్ఎస్ నాయకులు సమీర్, నవీన్, సంతోష్, గంగప్రసాద్ గౌడ్, ఆరీఫ్, శంకర్, నర్సాగౌడ్, శంకర్ గౌడ్ తదితరులు వున్నారు.