నందిపేట్, సెప్టెంబర్ 10: ఇందిరమ్మ రాజ్యమంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా ? అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్మూర్‌లో పోలీసుల అరాచకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని.. కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని బుధవారం ఓ ప్రకనటలో విమర్శించారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్‌లో యువకులు కేసీఆరే రావాలి.. కారే రావాలని పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తుంటే వారిపై అక్రమ కేసులు పెట్టారన్నారు.
కేసీఆర్ పాటలు వింటే పోలీసులకెందుకు అభ్యంతరమని ప్రశ్నించా రు. దళిత యువకుడు రోహిత్‌ను అదుపులోకి తీసుకుని రెండు రోజులు గా చిత్రహింసలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను కా పాడే పోలీసులా.. హింసించే కాంగ్రెస్ కార్యకర్తలా ? అని నిలదీశారు. అధికార పార్టీ అండదండలతో పేకాట క్లబ్‌లు నడుస్తున్నా, గంజాయి విక్రయాలు సాగుతున్నా, నల్లమట్టి స్మగ్లింగ్ జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు.. కేసీఆర్‌ను అభిమానించే వారిపై ప్రతాపం చూపడం ఏమిటని ప్రశ్నించా రు.
కొందరు అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి అకృత్యాలకు పాల్పడుతున్నారని, వారి పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్న వారి లెక్కలు తే లుస్తామని హెచ్చరించారు. పోలీసులు రోహిత్‌ను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పది వేల మందితో పోలీస్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్బంధంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, హెచ్ఆర్సీ, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.