బాన్సువాడ/ఆర్మూర్ టౌన్, మే 11: బండి సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెం టనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాలు పలు సంఘాలు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు.ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.
బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించి బండి సంజయ్, ఆయన కుమారుడు బండి భగీరథ్ చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకు లు మాట్లాడుతూ.. పొక్సో కేసు నమోదైనా ఇప్పటి వర కూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. నేరాలను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటనలో ఇప్పటివరకూ నిందితులను పట్టుకోలేకపోవడం రాష్ట్రంలోని చట్టవ్యవస్థ పరిస్థితిని తెలియజేస్తుందన్నారు.