Nizamabad | పోతంగల్, జనవరి 10 : బాధిత కుటుంబాలకు సామాజిక సేవకర్త మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీమ్ శనివారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలంలోని చేతన్ నగర్ గ్రామానికి చెందిన నాగవ్వ ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పంటుకొని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె భర్త ధీన పరిస్థితిని గ్రామ సర్పంచ్ కాంతబాయి సునీల్, హకీం దృష్టికి తీసుకువెళ్లారు. కాగా స్పందించిన అయన తన వంతుగా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.
అనంతరం మండలంలోని హంగర్గ గ్రామానికి చెందిన బందేల్లి ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోలేదని గ్రామ సర్పంచ్ ఉదయభాస్కర్ హకీమ్ కు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హకీమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో షేరు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.