జహీరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. జహీరాబాద్ పార్లమెంట్ బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్‌కుమార్, కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్, బీజేపీ నుంచి బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో వరుసగా రెండుమార్లు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్‌కుమార్‌ను బరిలో నిలిపింది. గాలి అనిల్‌కుమార్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్లను కలిసి గెలిపించాల్సిందిగా కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు గాలి అనిల్‌కుమార్ గెలుపుకోసం ప్రచారం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో పాటు ప్రజలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై ఓటర్లు వ్యతిరేకతతో ఉన్నారు. పదేండ్లలో బీజేపీ ప్రభుత్వం జహీరాబాద్ పార్లమెంట్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు.
బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న అపప్రథ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏఒక్క హామీని నెరవేర్చలేదు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. దీంతోప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపడం లేదు. తెలంగాణ, జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో జహీరాబాద్ పార్లమెంట్లో మూడోసారి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2024 జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి గాలి అనిల్‌కుమార్(బీఆర్ఎస్), సురేశ్ షెట్కార్(కాంగ్రెస్), బీబీ పాటిల్(బీజేపీ) పోటీ చేస్తున్నారు. రిజిస్టర్ ఎన్నికల పార్టీల నుంచి కొత్త బలిజ బస్వరాజ్(తెలంగాణ ప్రజాశక్తి పార్టీ), గుర్రపు మశ్చేందర్(ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్), చావగాని మని(ఆలయన్స్ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్పార్టీ), టీడీఎస్ మణి(ధర్మసమాజ్‌పార్టీ), మోహన్‌రెడ్డి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), ఆర్బీ దుర్గయ్య(ఇండియా ప్రజాబంధు పార్టీ) ఎంపీగా పోటీ చేస్తున్నారు.వీరితో పాటు పది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.