KCR Birthday | కోటగిరి, ఫిబ్రవరి 17 : తెలంగాణ జాతిపిత, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ సీఏం కేసీఆరేనని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు వల్లే పల్లి శ్రీనివాస రావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను కోటగిరి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భగా తెల్ల రవికుమార్, వల్లేపల్లి శ్రీనివాసరావు, మోరే కిషన్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ గౌరవానికి చిరునామాగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కేసీఆర్ నిలిచారని కొనియాడారు. రైతుబంధు పథకంతో దేశానికి దారి చూపిన రైతు బాంధవుడు, స్వాభిమానాన్ని శ్వాసగా మార్చిన ఉద్యమ నేత, సంకల్పంతో తెలంగాణ స్వ రాష్ట్రాన్ని సాధించి భవిష్యత్‌కు బాటలు వేసిన మహానేత కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తెల్ల చిన్న అరవింద్, నజీర్, బొట్టే గజేందర్, శంకర్ గౌడ్, అంబటి గంగా ప్రసాద్ గౌడ్, దేవేందర్, దిలీప్ పటేల్, శ్రీనివాస గౌడ్, ఫారూఖ్, అజ్మీర్ కిషన్, కొత్తపల్లి రాజు, విజయ్, పాల గంగారాం, కన్నం సాయిలు. పోశెట్టీ, శివ తదితరులు పాల్గొన్నారు.