Amritpal Singh | మాల్దోవాలో చిక్కిన గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్.. ఇండియాకు అప్పగింత
Amritpal Singh : పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ మాల్దోవాలో పట్టుబడ్డాడు. అతడిని పంజాబ్ పోలీసులు ఇండియాకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు.
Amritpal Singh : పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ మాల్దోవాలో పట్టుబడ్డాడు. అతడిని పంజాబ్ పోలీసులు ఇండియాకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్ ఇండియాలో అనేక నేరాలకు పాల్పడ్డాడు. పంజాబ్ సహా అనేక ప్రాంతాల్లో అతడిపై 21 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతడు 2024 అక్టోబర్‌లో చండీగఢ్ నుంచి జారీ చేసిన ఫేక్ పాస్‌పోర్టు ఉపయోగించి, ఇండియా నుంచి పారిపోయాడు.
అప్పటినుంచి పంజాబ్ పోలీసులు అతడి కోసం గాలిస్తూనే ఉన్నారు. మొదట అతడు యూఏఈ వెళ్లాడు. తర్వాత అక్కడినుంచి వివిధ దేశాలకు వెళ్లిపోయాడు. చివరగా మాల్దోవా దేశం వెళ్లాడు. అక్కడినుంచి సరిహద్దు మార్గంలో ఉక్రెయిన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న మాల్దోవా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్‌కుచెందిన యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ (ఏజీటీఎఫ్)తోపాటు దేశీయ ఇంటెలిజెన్స్ సంస్థలు, వివిధ దేశాల సంస్థలతో కలిసి పని చేశాయి.
అతడిని పట్టుకునేందుకు ఆపరేషన్ ఈస్టర్న్ రీచ్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మాల్దోవాలో ఉన్న అతడిని తీసుకొచ్చేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కేంద్ర సంస్థలు, మాల్దావా పోలీసులతో కలిసి చర్యలు చేపట్టాయి. అతడిని ఇండియాకు అప్పగించాల్సిందిగా మాల్దోవా ప్రభుత్వాన్ని ఇండియా కోరింది. దీనికి అక్కడి కోర్టు అంగీకరించింది. మే 26న అతడిని అప్పగించేందుకు అంగీకరించింది. అయితే, ఈ నిర్ణయాన్ని అతడు పై కోర్టులో సవాలు చేశాడు. దీనిపై ఇంతకాలం విచారణ జరిగింది. చివరకు అతడి పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
అతడిని ఇండియాకు అప్పగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అక్కడి చిసినౌ ఎయిర్‌పోర్టులో ఇండియాకు అప్పగించింది. సెప్టెంబర్ 12న అతడిని పంజాబ్ పోలీసులు ఇండియా తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఇండియా చేరుకున్నాడు. అతడిపై నమోదైన 21 క్రిమినల్ కేసులపై విచారణ జరగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amritpal Singh
- India
- moldova
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

