బూర్గంపహాడ్, సెప్టెంబర్ 12 : దక్షిణ చత్తీస్గఢ్లో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా జోరు వర్షం కురిసింది. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో జనజీవనం స్తంభించింది. ఎల్నినో ప్రభావం, వర్షాభావంతో ఇప్పటికే అన్నదాతలు వ్యవసాయ సాగులో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షం మండలంలో వరిసాగు చేపట్టిన రైతులకు ప్రాణం పోసినట్లయింది. గత రెండు రోజులు ఎండ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరయిన వృద్ధులు, చిన్నారులకు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలిగింది.