బిచ్కుంద, అక్టోబర్ 28: కామారెడ్డి జిల్లా బిడ్డ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. బిచ్కుంద మండలం పెద్ద తక్కడ్పల్లికి చెందిన ప్రతిభ చెస్బాక్సింగ్లో సత్తా చాటింది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియాలో జరిగిన 6వ అంతర్జాతీయ చెస్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ప్రతిభ చాటి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
పైగా, ఈసారి జరిగిన పోటీల్లో వెయిట్ కేటగిరీ తొలగించడం వల్ల, తనకన్న అధిక బరువు కేటగిరీకి చెందిన ప్రత్యర్థులతోనూ తలపడిన ప్రతిభ ఏమాత్రం వెరువకుండా వరుస విజయాలు సాధించింది. చివరకు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. వరుసగా పతకాలు సాధిస్తున్న ప్రతిభను గ్రామస్తులు అభినందిస్తున్నారు.