పొతంగల్: దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి జెండా ను ఎగురవేసినందుకు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఢిల్లీ ప్రజలూ బిజెపి పార్టీకి పట్టం కట్టారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ పటేల్, బజరంగ్ హన్మండ్లు, పబ్బ శేఖర్, సుదం శంకర్, సుధం హన్మండ్లు, రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని అందాపూర్ గ్రామంలో శనివారం బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ 48 మంది అభ్యర్థులు గెలుపొంది అధికారం చేజిక్కించుకోవడంతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నాయకులు సిర్ప సుదర్శన్, రాధ కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Banswada Bjp
బాన్సువాడ : దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి జెండా ను ఎగురవేసినందుకు
బాన్సువాడ పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ జెండాను ఎగరవేశామని నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పై దేశ ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, గంగారెడ్డి, చిరంజీవి, శంకర్ గౌడ్, చిదర సాయిలు, లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, వెంకట్, ఉమేష్, సిద్ధార్థ, అశ్విన్ శంకర్, భాస్కర్ రెడ్డి, అరుణ్ కుమార్, సుధాకర్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు
పెద్ద కొడప్గల్ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని అంజనీ గ్రామంలో శనివారం పశు వైద్యాధికారి మణి కుమార్ ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మణి కుమార్ మాట్లాడుతూ పశు వైద్య శిబిరం లో 36 పశువులకు గర్భకోశం చికిత్సలు,రెండు కృత్రిమ గర్భధారణ చికిత్సలు,16 పశువులకు సాధారణ చికిత్సలు చేశామని , 17 దూడలకు నట్టల నివారణ మందులు వేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ మణి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్ర సూపర్వైజర్ బస్వరాజ్,గోపాల మిత్ర కె.రవీందర్, గౌస్, రాజిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.