కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
మూడేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని ముదెల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బల్గూరి స్రవంతి - ప్రవీణ్ దంపతుల చిన్న కుమారుడు లక్ష్మణ్ ఆదివారం ఇంటి ముందర ఆడుకుంటున్నాడు. వీధి కుక్కలు బాలుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేశారు.
- పరిస్థితి విషమం
- నిజామాబాద్ తరలింపు
- ముదెల్లిలో ఘటన
గాంధారి, జూన్ 11: మూడేండ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని ముదెల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బల్గూరి స్రవంతి – ప్రవీణ్ దంపతుల చిన్న కుమారుడు లక్ష్మణ్ ఆదివారం ఇంటి ముందర ఆడుకుంటున్నాడు. వీధి కుక్కలు బాలుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేశారు. కుక్కలు బాలుడిని పొట్ట భాగంలో కరవడంతో పేగులు బయటికి వచ్చాయి. వెంటనే అతడిని బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Boy injured
- Dog attack
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

