సిరికొండ,జూలై 26: ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం ధూప్యాతండాలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మలావత్ గజేందర్లికిత దంపతుల మొదటి కుమారుడు కన్నయ్య (2) రోజూ మాదిరిగా ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి నీరు మింగి మృతి చెందాడు. బాలుడి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.