Bonala festival | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ప్రతీ ఏటా వానాకాలం పంటలు కోతకు వచ్చిన సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో రైతులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ఇందులో భాగంగా ఎల్లమ్మ గుట్ట ప్రాంత రైతులు బోనాల పండుగను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించారు.
మహిళలు, యువతులు బోనాల ఊరేగింపుతో ఎల్లమ్మ గుట్ట నుంచి పోచమ్మ గల్లీలోని ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు మాజీ కార్పొరేటర్లు పంచారెడ్డి నర్సుబాయి సురేష్, న్యాలం రాజు, తెలంగాణ జాగృతి అధ్యక్షుడు మురళి, పంచారెడ్డి ఎర్రన్న, పెద్ద లింగాన్న,శంకర్, నడిపి ఎరన్న, కిషన్, గంగాధర్, సంతోష్, శ్రీకాంత్, ప్రవీణ్, వినోద్, సుమన్, నాగేష్, నరేష్, రాము, చరణ్, నవకాంత్ తదితరులు పాల్గొన్నారు.