Bodhan | బోధన్ రూరల్, ఏప్రిల్ 27: వరంగల్ లో నిర్వహిస్తున్న బీఆర్ ఎస్ పార్టీ భారీ సభకు బోధన్ మండలంలోని అన్ని గ్రామ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్బంగా అన్ని గ్రామ నాయకులు జై తెలంగాణ.. జై కేసీఆ ర్ అని నినాదాలు చేసుకుంటూ బస్సులు లో బయలు దేరి వెళ్లారు.
అదే విధంగా సాలూర మండలంలో నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధర్మయ్య గారి సంజీవ్ కుమార్, యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు భవానీపేట్ శ్రీనివాస్, నాయకులు గణేష్ పటేల్, లక్ష్మణ్, రామయ్య, గోపాల్, దాస్ గౌడ్, మోతిరం తదితరులు పాల్గొన్నారు.