BJP | శక్కర్ నగర్ : వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక మండపాల దగ్గర పారిశుధ్యం, మురికికాలువల శుభ్రత ఉండేట్టుగా చూడాలని, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది రాకుండా ఆ శాఖ సిబ్బందికి సూచలను చేయాలని, అన్నదానాలు జరిగే వినాయక మండపాల వద్ద తాగునీటి సరఫరా ఏర్పాటు చేయించాలని, విస్తరాకులు ఎత్తివేయడానికి కార్మికులను, ట్రాక్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ వినాయక మండపం దగ్గర ప్రతీరోజు శుభ్రం చేయించాలని, రోడ్లపై, గణేష్ మండపాల వద్ద ఉన్న గుంతలను మొరం వేయించి పూడ్చాలని, వర్షపు నీరు గణేష్ మండపాల దగ్గరికి రాకుండా నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజుల దేవి పవన్ కుమార్, ఏనుగంటి గౌతమ్ గౌడ్, దేవకట్టే శివరాజ్, గొడుగు ధర్మపురి, ఏషాల సురేందర్, పెరిక వెంకటేష్, గుంత గంగాధర్, అడ్లూరి ఫణి, కలికోట కృష్ణ, నిమ్మ శ్రీనివాస్, లోసురే అనిల్, బిల్లా విజయ్, ఏనుగంటి గంగా సాగర్ తదితరులు పాల్గొన్నారు.