రోడ్డు విస్తరణ కోసం సొంతిల్లు కూల్చివేత
రోడ్డు విస్తరణ కోసం అవసరం మేరకు తన ఇంటినే కూల్చివేయించారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అధికారుల సమక్షంలో శనివారం స్వచ్ఛందగా కూల్చివేత పనులను ప్రారంభించారు.
- స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే
- అధికారుల సమక్షంలో తొలగింపు పనులు
- గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా: కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, జనవరి 27: రోడ్డు విస్తరణ కోసం అవసరం మేరకు తన ఇంటినే కూల్చివేయించారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అధికారుల సమక్షంలో శనివారం స్వచ్ఛందగా కూల్చివేత పనులను ప్రారంభించారు. కామారెడ్డి పాత బస్ట్టాండ్ నుంచి అడ్లూర్ వైపు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే కుటుంబానికి దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు ఉన్నది. గతంలో ఈ రోడ్డును మాస్టర్‌ప్లాన్‌లో 80 ఫీట్లుగా చూపగా.. వాస్తవానికి 30 నుంచి 40 ఫీట్ల వరకు మాత్రమే ఉన్నది ఈ మార్గంలో రద్దీ పెరగడంతోపాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రోడ్డు విస్తరణకు తన ఇల్లు అడ్డుగా ఉందని భావించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూల్చివేత నిర్ణయం తీసుకొని ఆర్అండ్బీ, మున్సిపల్ టౌన్‌ప్లానింగ్, ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిని కూల్చి వేసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని పట్టణప్రజలకు ఆయన సూచించారు. కామారెడ్డి అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తానని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

