నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయంపై నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల బీజేపీ (BJP) నాయకులు సంబురాలు నిర్వహించారు. తెలంగాణ లో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ నాయకులు అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్య , గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజి రెడ్డి విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని అని రుద్రూర్ మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, ఎమ్మెల్సీల ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన అభ్యర్థులే ఈ విజయానికి కారణమని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తుందన్నారు.
గ్రామాల అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని, ఈ పార్టీ అందరికీ రక్షణ కవచంలా ఉంటుందని తెలిపారు. గత 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమిటి లేదని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని, గ్రూపు రాజకీయాలు చేస్తూ ఆధిపత్య పోరు కోసం పాటుపడుతోందని విమర్శించారు. బిజెపి పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద బానిసంచను పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబెర్ ప్రశాంత్ గౌడ్, మండల సీనియర్ నాయకులు తోట శంకర్, రాంరాజు, మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్,రేపల్లి సాయిప్రసాద్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్ గారు మరియు సతీష్ పవర్, శ్రీనివాస్, పోతురాజు శ్రీనివాస్,గంగాధర్, రాజేష్, రజినీకాంత్,తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.