కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ ( BJP )ఆధ్వర్యంలో గురువారం టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ( MLC Elections ) బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తో ఆనందం వ్యక్తo చేశారు. ఈ సందర్బంగా బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు.
రాబోవు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. టీచర్స్ ఎన్నికల్లో కొమురయ్య (Komaraiah) , పట్ట భద్రుల ఎన్నికల్లో అంజిరెడ్డి (Anjireddy) విజయం సాధించారని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు పూలేల మోహన్ రావు, రాజు, శ్రీనివాస్, సాయి ప్రసాద్ తదితరులు ఉన్నారు.